News June 4, 2024
ఎచ్చెర్ల: కౌంటింగ్ కేంద్రాలు DIG పరిశీలన

ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని మంగళవారం మధ్యాహ్నం విశాఖ రేంజ్ DIG విశాల్ గున్ని సందర్శించారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించి, కౌంటింగ్ జరగుతున్న తీరుపై అధికారులును అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నందు ఆయన పర్యవేక్షించారు.
Similar News
News December 1, 2025
ధాన్యం రవాణాకు GPS వాహనం తప్పనిసరి: కలెక్టర్

ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్ఎస్కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 1, 2025
ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి: శ్రీకాకుళం కలెక్టర్

ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్ఎస్కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 1, 2025
శ్రీకాకుళం: డయేరియాపై మంత్రి అచ్చెన్న ఆరా.!

సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియాతో ఒకరు మృతి చెందడం, పలువురు వ్యాధి భారిన పడిన సంఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఆరా తీశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్య బృందాలను పంపించి వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.


