News April 6, 2024

ఎచ్చెర్ల: చిన్నరావుపల్లిలో రూ.1,22,206 కరెంట్ బిల్లు

image

ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో కరెంట్ బిల్లు చూసి బాధితులు శనివారం కంగుతిన్నారు. పప్పల ముకుందరావు అనే వారి ఇంటి కరెంట్ బిల్లు రూ.1,22,206 వచ్చింది. చిన్న ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. వారికి ఇంత కరెంట్ బిల్లు రావడంతో మేము ఎలా కట్టేది అని ఇంటి యజమాని లబోదిబోమంటున్నారు. వారి ఇద్దరు పిల్లలు బతుకుదెరువు కోసం వేరే ఊరిలో ఉంటున్నారు. సంబంధిత అధికారుల తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Similar News

News January 24, 2025

SKLM: పరీక్షా ఫలితాలు విడుదల

image

శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో (స్వయం ప్రతిపత్తి) ఐదవ సెమిస్టర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను అంబేడ్కర్ యూనివర్సిటీ డీన్ ఎస్. ఉదయభాస్కర్, ప్రిన్సిపల్ సూర్యచంద్ర ఆవిష్కరించారు. బీఏ 97.10% బీకాం జనరల్ 100%, బీకాం ఒకేషనల్‌లో 100%, బీఎస్సీలో 77.11% ఫలితాలు వచ్చాయన్నారు. అదే విధంగా కాలేజీ మొత్తం ఫలితాల శాతం 85.68% వచ్చేయని తెలిపారు.

News January 24, 2025

కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్‌లో రెండు పూటలా రిజర్వేషన్

image

కంచిలి మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్‌లో నాలుగు నెలలుగా నెలకొన్న సమస్యకు శుక్రవారం పరిష్కారం లభించింది. సోంపేట రైల్వేస్టేషన్‌లో రెండో పూట రిజర్వేషన్ కౌంటర్‌ను రైల్వే అధికారులు పునఃప్రారంభించారని ఈస్ట్ కోస్ట్ రైల్వేజోన్ జెడ్ఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు నెలలుగా నెలకొన్న సమస్య పరిష్కారం పట్ల రైల్వే కమిటీ సభ్యులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

News January 24, 2025

పాతపట్నం: యువతి నుంచి ఫోన్‌ కాల్.. నిండా ముంచారు

image

హనీ ట్రాప్‌తో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు మోసపోయాడు. ఈనెల 18న ఓ యువతి నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. 19న పెద్దిపాలెం వెళ్తుండగా.. మరోసారి ఆమె నుంచి ఫోన్‌ వచ్చింది. ఇంతలో సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని యువతి చెప్పగా.. అతడు అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు ఆయనను బైక్ ఎక్కించుకొని విజయనగరం వైపు తీసుకుపోయారు. మధ్యలో ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదు దోచుకున్నారు.