News July 20, 2024
ఎచ్చెర్ల: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో సూరాడ లక్ష్మణ (40) శనివారం ఉదయం చేపల వేటకు వెళ్లగా అలల తాకిడికి దుర్మరణం చెందారు. అటుగా వెళ్లిన జాలర్లు మృతదేహాన్ని గుర్తించారు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
SKLM: జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మందిరంలో జల్ జీవన్ మిషన్పై ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంనకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గురించి సంబంధిత డిఈ కలెక్టర్కు వివరించారు.
News November 5, 2025
శ్రీకాకుళం: ‘ప్రతి 3నెలలకు ఒకసారి సమావేశం’

జిల్లాను అభివృద్ధిబాటలో నడిపించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం ZP సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా సమీక్షలో అయన పాల్గొన్నారు. వ్యవసాయం, ఉపాధి కల్పన,పరిశ్రమలు,పారిశుద్ధ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్రస్థాయిలో చర్చించవలసిన అంశాలపై ప్రతి 3నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లా MLAలు పాల్గొన్నారు.
News November 5, 2025
శ్రీకాకుళం: మీలో ప్రతిభకు ఈ పోటీలు

యువజన సర్వీసుల శాఖ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో (జానపద బృంద నృత్యం, గీతాలు), స్టోరీ రైటింగ్, కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్ పోటీలను NOV 11న నిర్వహించనున్నారు. ఆ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పలనాయుడు ప్రకటనలో తెలిపారు. 15-29 ఏళ్లు ఉన్న యువతీ, యువకులు అర్హులని, శ్రీకాకుళం(M)మునసబపేటలోని గురజాడ ఆడిటోరియంలో పోటీలు జరుగుతాయన్నారు. వివరాలకు పని వేళల్లో ఈనం:97041 14705ను సంప్రదించాలన్నారు.


