News September 25, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ ఆరో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఓల్డ్ రెగ్యులేషన్ సప్లిమెంటరీ డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మొత్తం 1154 మంది హాజరు కాగా 822 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 71.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Similar News

News October 25, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

★ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి: అచ్చెన్న
★గార: నవంబర్ 2న కూర్మనాధుని తెప్పోత్సవం
★బూర్జ: రైతులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేపై నిరసన
★హరిపురం PHCని తనిఖీ చేసిన ఎమ్మెల్యే శిరీష
★త్వరలో సీబీఎస్ఈ పాఠశాల ఏర్పాటు: శ్రీకాకుళం ఎమ్మెల్యే
★2029 నాటికి ప్రతీ ఇంటికీ ఒక ఉద్యోగం: పాతపట్నం ఎమ్మెల్యే
★ఆమదాలవలస: 20 కోట్లతో కన్నతల్లికి గుడి

News October 24, 2025

తిలారు: రైలు ఢీకొని ఒకరు మృతి

image

తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో డౌన్ లైన్‌లో రైలు ఢీకొని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి 45 ఏళ్లు ఉంటాయాని, నీలం రంగు హాఫ్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని తెలియజేశారు. ఆచూకీ తెలిసినవారు 91103 05494 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News October 24, 2025

SKLM: డైట్‌లో పోస్టులకు ఈ నెల 29 లాస్ట్ డేట్

image

వమరవెల్లిలోని ప్రభుత్వ జిల్లా శిక్షణ సంస్థ (డైట్‌లో) డిప్యూటేషన్‌పై లెక్చరర్లు పోస్టులు భర్తీ చేసేందుకు అక్టోబర్ 29న ఆఖరి తేదీని జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు పేర్కొన్నారు. డిప్యూటేషన్‌పై ముగ్గురు సీనియర్ లెక్చరర్లు, 8 మంది సాధారణ లెక్చరర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. ZP మున్సిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే అర్హులన్నారు.