News August 11, 2024
ఎచ్చెర్ల: డిగ్రీ రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థుల రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల చేశారు. 2020 నుంచి 2022 వరకు సప్లిమెంటరీ ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచామని ఉదయభాస్కర్ ప్రకటించారు. సప్లిమెంటరీలో 58.87% ఉత్తీర్ణత నమోదయింది. 6011 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు.
Similar News
News February 28, 2026
SKLM: తగ్గుముఖం పట్టినంతవరకు వైద్య బృందం అప్రమత్తం

శ్రీకాకుళంలో డయేరియా పూర్తిగా తగ్గుముఖం పట్టినంత వరకు వైద్యాధికారుల బృందం అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి అన్నారు. శనివారం దమ్మలవీధి, కాకివీధి, బోడెమ్మకోవెల, తదితర అతిసార ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. అతిసారం తగ్గుముఖం పట్టిందని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఆరుబయట ఆహార పదార్థాలు తినరాదని, కాచి చల్లార్చిన నీరు తాగాలన్నారు.
News February 28, 2026
SKLM: ప్రొబిషనరీ నియామకాలపై అభ్యంతరాలకు లాస్ట్ డేట్..

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్/ప్రభుత్వ మునిసిపల్ యాజమాన్య పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొబిషనరీ నియామకాలు చేపట్టింది. ఈ మేరకు డీఈవో రవిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియమాలకు సంబంధించిన వివరాలు https://www.sites.google.com/site/deosklorg/లో చూసి మార్చి 7వ తేదీ లోగా అభ్యంతరాలు తెలియజేయాలన్నారు.
News February 28, 2026
SKLM: డయేరియా ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్స్ నియామకం

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో 21 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో వార్డులో ఆరుగురు ఉద్యోగులు ఉదయం 5.30 నుంచే విధుల్లో ఉంటారని అన్నారు. డయేరియాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని వార్డు సచివాలయాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారన్నారు.


