News January 3, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ 2, 4 సెమిస్టర్ల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 2,4 సెమిస్టర్లకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ఫలితాల కోసం https://jnanabhumi.ap.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించి ఫలితాలను చూడొచ్చని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News January 18, 2025

శ్రీకాకుళం: నవోదయ ప్రవేశ పరీక్షకు 7247 మంది విద్యార్థులు 

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షకు 7247 మంది విద్యార్థులు హాజరైనట్లు నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పరసరామయ్య తెలిపారు. వీరిలో బాలురు 3845 మంది, బాలికలు 3402 మంది హాజరయ్యారు. జిల్లాలో 32 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 8290 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1043 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు.

News January 18, 2025

శ్రీకాకుళం: ఆమె నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళం పట్టణం పి.యన్ కాలనీకి చెందిన తిర్లంగి అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలు దానం చేయాలని కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. అనంతరం రెడ్ క్రాస్ ప్రతినిధి నారా హర్షవర్దన్, రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకి తెలిపారు. వైజాగ్ ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రం కార్నియా సేకరించారు. ఆమె కళ్లు వేరొకరికి వెలుగునిస్తాయని కుటుంబసభ్యులు ఆనందిస్తున్నారు.

News January 18, 2025

జనసేన నాయకురాలు కాంత్రిశ్రీ మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్

image

ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ అనారోగ్యంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమె మృతికి సంతాపం తెలిపారు. అనంతరం శాంతిశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆమె ఉత్తరాంధ్రలో చేపట్టిన పలు పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో తనవంతు పాత్ర పోషించారన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.