News December 23, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను యూనివర్సిటీ డీన్ ఉదయ్ భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా పరీక్ష పేపర్ల రీవాల్యుయేషన్, రివెరిఫికేషన్ కోసం రేపటి నుంచి నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

‘తాగునీటిలో ‘ఈ-కోలి’.. అందుకే డయేరియా’

image

శ్రీకాకుళం నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే అతిసార వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

News February 27, 2026

విశాఖ-పలాస మార్గంలో పలు రైళ్లు రద్దు

image

విశాఖ-పలాస-బరంపురం మార్గంలో మార్చి 2వ తేదీన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. విశాఖ-బరంపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-పలాస మెమూ ప్యాసింజర్ (67289/67290) రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ వెల్లడించారు. సిగడాం, పొందూరు, దూసి పరిధిలో భద్రత పరమైన పనుల నిమిత్తం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.