News December 28, 2024
ఎచ్చెర్ల: దారుఢ్య పరీక్షలకు ముమ్మరం ఏర్పాట్లు

ఎచ్చెర్ల ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ పరేడ్ మైదానాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT,PET పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రవేశం,వెళ్లే మార్గాలను ఎస్పీ పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు అవసరమైన కౌంటర్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News November 17, 2025
సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.
News November 17, 2025
బుడితి: ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది.. గర్భిణుల మృతితో అలజడి

అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి.. ఇటీవల కాలంలో ఆ హాస్పిటల్లో గర్భిణులు శస్త్ర చికిత్స అనంతరం మృతి చెందడం కొనసాగుతుంది. దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సారవకోట మండలం బుడితి సీహెచ్సీలో గతంలో ఒకేరోజు ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. తాజాగా శనివారం మరో గర్భిణి మృతి చెందింది. దీనిపై అధికారులు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.
News November 17, 2025
SKLM: ‘కుష్టు వ్యాధిపై సర్వేకు 2,234 బృందాలు నియమించాం’

కుష్టు వ్యాధిపై సర్వేకు జిల్లా వ్యాప్తంగా 2,234 బృందాలను నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు DMHO డాక్టర్ తాడేల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 17-31 వరకు ఈ వ్యాధిపై ఆశా కార్యకర్త, వాలంటీర్లు రోజుకు 20 గృహాల్లో సర్వే నిర్వహిస్తారన్నారు. స్పర్శ లేని మచ్చలను గుర్తించాలని ఆయన వారికి చెప్పారు.


