News December 28, 2024
ఎచ్చెర్ల: దారుఢ్య పరీక్షలకు ముమ్మరం ఏర్పాట్లు
ఎచ్చెర్ల ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ పరేడ్ మైదానాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT,PET పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రవేశం,వెళ్లే మార్గాలను ఎస్పీ పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు అవసరమైన కౌంటర్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News January 16, 2025
శ్రీకాకుళం: రేపు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్
శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ జరగనుంది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత పేర్కొన్నారు.
News January 16, 2025
సిక్కోలు రచయిత్రికి ఐదోసారి జాతీయ పురస్కారం
సమీక్షకురాలిగా, సామాజికవేత్తగా రాణిస్తున్న యువ రచయిత్రి, కోస్టా సచివాలయం మహిళా పోలీస్ అమ్మోజీ బమ్మిడి ఐదోసారి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలుగు అసోసియేషన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు గురువారం అమ్మోజీకి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. జనవరి 21న విజయవాడలో ప్రముఖుల చేతుల మీదుగా అమ్మోజీ తెలుగుతేజం అవార్డుతోపాటు రూ.10 వేలు అందుకోనున్నారు. ఆమె “అమ్మూ” కలం పేరుతో రచనలు చేస్తున్నారు.
News January 16, 2025
శ్రీకాకుళం: సీపీఎం నేత మూర్తి మృతి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీపీఎం నేత కామ్రేడ్ బిజికే మూర్తి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నేటి తెల్లవారుజామున మృతి చెందారని సీపీఎం నాయకులు గోవిందరావు తెలిపారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. సీపీఎం నాయకులు ఆయనకి సంతాపం తెలిపారు.