News November 27, 2024
ఎచ్చెర్ల: పీజీ కోర్సులో ఈనెల 29న స్పాట్ అడ్మిషన్
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మిగులు సీట్లకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ఉదయం.10 నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఈ ప్రవేశాలు జరగనున్నాయని తెలిపారు. ఏపీ పీజీ సెట్ -2024 అర్హతతో సంబంధం లేకుండా డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News December 3, 2024
శ్రీకాకుళం: ఈ నెల 9 వరకు మార్పులు, చేర్పులకు అవకాశం
శ్రీకాకుళంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3,906 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముసాయిదా ఓటర్లు డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించినన్నారు. అనంతరం మార్పులు, చేర్పులకు ఈనెల 9వ తేదీన www.coeandhra.nic.in వెబ్‌సైట్‌లో కాని, సంబంధిత ఓటర్ల నమోదు అధికారికిగాని సంప్రదించి దరఖాస్తులను సమర్పించవచ్చు.
News December 2, 2024
SKLM: గంజాయి వ్యాపారుల ఆస్తులను జప్తు చేస్తాం: DIG
గంజాయి కేసుల్లో ఇటీవల అరెస్టు అయిన నిందితులు, వారు గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన ఆస్తులను గుర్తించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి జూమ్‌లో వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన విశాఖ రేంజ్ పరిధిలోని ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. నిందితుల పేరున గుర్తించిన ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
News December 2, 2024
SKLM: ఎస్పీ స్పందనకు 50 అర్జీలు
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు 50 అర్జీలు అందించారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.