News April 27, 2024

ఎచ్చెర్ల: మళ్లీ వైసీపీ గూటికి చేరిన పైడి శ్రీనివాసరావు

image

ఇటీవల వైసీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పైడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అనకాపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గానికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Similar News

News April 16, 2026

కోటబొమ్మాళి: యాక్సిడెంట్‌లో 38 ఏళ్ల యువకుడు స్పాట్ డెడ్

image

కోటబొమ్మాళి మండలం జాతీయ రహదారి పాకివలస సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. బైక్‌పై కూరగాయలను అమ్ముకొని తిరిగొస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు పొన్నాడ పేటకు చెందిన మురళి (38)గా గుర్తించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

News April 16, 2026

మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

image

భార్యను నాటు తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం సోంపేట అదనపు జడ్జి కె.కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి మండలం భరణికోట గ్రామానికి చెందిన సవర పద్మ అనే మహిళను ఆమె భర్త జగ్గారావు 2021 అక్టోబర్ 21న నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు తెలిపారు.

News April 16, 2026

నరసన్నపేట: ‘ముద్దాయిలకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం’

image

నరసన్నపేట‌లోని స్థానిక సబ్ జైలును జిల్లా న్యాయాధికార సేవా సంస్థ కార్యదర్శి హరిబాబు ఆకస్మికంగా పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం సబ్ జైలుకు చేరుకున్న ఆయన ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..బెయిల్ కోసం ప్రయత్నం చేసే ముద్దాయిలకు న్యాయాధికారి సేవా సంస్థ తరఫున ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ వినయ్ కుమార్ ఉన్నారు.