News August 3, 2024
ఎచ్చెర్ల: హార్బర్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్
బుడగట్లపాలెం సముద్రతీరంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ శనివారం తన పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే జరిపి హార్బర్ పనులకు అడ్డంకి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 14, 2024
రాజాం: డీజే సౌండ్‌కు యువకుడు కుప్ప కూలిపోయాడు
రాజాం మున్సిపాలిటీ పరిధిలో పొనుగుటివలసలో శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో డీజే సౌండ్‌కు గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల యువకుడు వావిలపల్లి వినయ్ గుండె పోటుకు గురయ్యాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న వినయ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే స్నేహితులు రాజాంలో ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నంలో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News September 14, 2024
SKLM: సెబ్ కానిస్టేబుల్ విజయ్‌పై వేటు
భార్య అనూష మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్‌ను సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సెబ్ డీఎస్‌ఈవో తిరుపాలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. సెబ్ కానిస్టేబుల్ అనూష మృతిచెందిన ఘటనలో విజయ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
News September 14, 2024
SKLM: రిమ్స్‌లో నవజాత శిశువు మృతి
నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం అంగన్వాడీ కేంద్రం వద్ద మతిస్థిమితం లేని మహిళ అప్పాజీ ఈనెల 8వ తేదీన రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నెలల వయస్సు, బరువు తక్కువగా ఉన్న శిశువును శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.