News April 4, 2024

ఎచ్చెర్ల: 6వ తేదీన బీఈడీ ప్రవేశాలు

image

బీఈడీ (ఎంఆర్) కోర్సులో డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం తక్షణ ప్రవేశాలు నిర్వహించనుందని వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ నెల 6 నుంచి వీటిని వర్శిటీలోని ఎడ్యుకేషన్ విభాగంలో నిర్వహించనున్నామని తెలియజేశారు. టీసీతో పాటు విద్యార్హతలతో కూడిన ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, నాలుగు ఫొటోలతో అభ్యర్థులు హాజరుకావాలన్నారు.

Similar News

News March 9, 2026

శ్రీకాకుళం: వైరల్.. సర్పంచ్‌గా గెలిపిస్తే ఫ్రీ WiFi అంట!

image

త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మందసకి చెందిన మోహన్ బాబు అనే వ్యక్తి ప్రకటించి హామీలు వైరల్ అవుతున్నాయి. గ్రామంలో వైఫై, సోలార్ లైటింగ్, ఆధునిక పార్కుల ఏర్పాటు వంటి ‘స్మార్ట్’ హామీలు ఇచ్చారు. అవినీతి లేని పాలన నుంచి యువతకు ఉపాధి వరకు గ్రామ బడ్జెట్‌కు మించి ఆయన ప్రకటించిన విజన్ చూసి, ఇది పల్లెటూరా లేక పారిస్ నగరా అని స్థానికులు సరదాగా చర్చించుకుంటున్నారు. ఈ మ్యానిఫెస్టోపై మీ కామెంట్?

News March 9, 2026

SKLM: విద్యార్థులు అలర్ట్.. ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్ డే

image

ఎచ్చెర్లలోని డాక్టర్ B.R.అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ 2021-22, 2022-23, 2023-24 అడ్మిటెడ్ బ్యాచ్ ఆరో సెమిస్టర్ ఇంటర్న్ షిప్ ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అభ్యర్థులు రూ.1425లను ఆయా కళాశాలలో, యూనివర్సిటీకి వచ్చి చెల్లించాలని ఎగ్జామినేషన్స్ డీన్ ఎం.అనురాధ ప్రకటనలో వెల్లడించారు. రూ.500 ఫైన్‌తో ఈ నెల 10 వరకు, రూ.1500 ఫైన్‌తో 11 తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు అన్నారు.

News March 9, 2026

శ్రీకాకుళం: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

image

శ్రీకాకుళం నగరం జడ్పీ ఎదురుగా APHB కాలనీకి చెందిన డబ్బీరు నిఖిత ఇటీవల మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. శ్రీకాకుళం రూరల్ నైర వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బిఎస్సీ, భువనేశ్వర్లో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఐబీపీఎస్ పరీక్ష ద్వారా క్లర్క్ పీవో ఉద్యోగాలకు, అలాగే ఎస్బీఐలో క్లర్క్ పోస్టుకు ఎంపికైంది. రెండు ఉద్యోగాలు ఇంటర్వ్యూ దశలో ఉన్నాయి.