News June 21, 2024

ఎచ్చెర్ల: 99.44 శాతం ఉత్తీర్ణత

image

డా.బిఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌కు 9,832 మంది విద్యార్థులకు గాను 9,777 మంది (99.44 శాతం) ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ డీన్ ఎస్ ఉదయ్ భాస్కర్ వివరాలను వెల్లడించారు. బీఈడీ మూడో సెమిస్టర్లో 1,027 కి 875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.

Similar News

News December 13, 2025

శ్రీకాకుళం: ‘లక్ష్యానికి దూరంగా ధాన్యం సేకరణ’

image

జిల్లాలో 30 మండలాల్లో ధాన్యం కొనుగోలు కోసం 406 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 6,50,000 మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. సంక్రాంతి లోపు వరి ధాన్యం నూర్పులు పూర్తి చేసి అమ్మటం రైతుల ఆనవాయితీ. ప్రస్తుతం పొలాల్లో వరి కుప్పలు దర్శనమిస్తున్నాయి. ధాన్యం అమ్మకం దళారులపై ఆధారపడే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల అమలు కావటం లేదని రైతులు అంటున్నారు.

News December 13, 2025

సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

image

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News December 13, 2025

కంచిలి: రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

image

కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.