News July 26, 2024
ఎచ్చెర్ల IIITలో కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం: బాలాజీ
ఎచ్చెర్లలోని IIITలో నేడు కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ బాలాజీ తెలిపారు.
నేడు 515 మందికి, శనివారం 521 మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 100 మంది అధ్యాపకులతో 15 బృందాలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News October 8, 2024
శ్రీకాకుళం: కేజీబీవీల్లో ఖాళీలు.. 15 వరకు అప్లై చేసుకోండి
శ్రీకాకుళం జిల్లాలోని KGBVలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO తిరుమల చైతన్య తెలిపారు. కుకింగ్- 9, డేనైట్ వాచ్‌మెన్- 4, స్కావెంజర్- 3, స్వీపర్- 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో చౌకీదారు- 6, హెడ్‌కుక్- 4, సహాయ కుక్- 6 పోస్టులకు ఆసక్తి గల మహిళలు ఈ నెల 15లోగా MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
News October 8, 2024
శ్రీకాకుళం: మద్యం దుకాణాలకు 880 దరఖాస్తులు
శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా ఏర్పాటుకానున్న ప్రైవేట్ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజులే గడువు ఉంది. ఈ నెల 2న ప్రారంభమైన ప్రక్రియ 9వ తేదీతో ముగియనుంది. అక్టోబర్ 7 నాటికి జిల్లావ్యాప్తంగా 158 దుకాణాలకు 880 దరఖాస్తులు వచ్చాయి. శ్రీకాకుళంలో 32 దుకాణాలకు 266, టెక్కలిలో 11కు 19, కోటబొమ్మాళిలో 15 షాపులకు 31, రణస్థలంలో 15కు 176 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
News October 8, 2024
దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి
మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారులు, ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.