News March 24, 2025

ఎటపాకకు చెందిన వ్యక్తి గోదావరిలో దూకి ఆత్మహత్య

image

ఎటపాకకు చెందిన అనిల్ అనే వ్యక్తి భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 10 ఏళ్ల క్రితం అనిల్ భార్య రజిని ఆత్మహత్య చేసుకుందని, అప్పటి నుంచి అనిల్ మనోవేదనకు గురైన మద్యానికి బానిసయ్యాడన్నారు. ఈనెల 16న నుంచి మద్యం తాగడం మానేశాడని.. 20వ తేదీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

Similar News

News March 31, 2025

నిర్మల్‌ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని మామడ మండలం తాండ్ర గ్రామంలో సోమవారం 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధకారులు వెల్లడించారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోత్రత నమోదైందన్నారు. కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News March 31, 2025

నెల్లూరు : ఈ రోజు రాత్రి 12 గంటల వరకే..

image

ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సోమవారం అర్ధరాత్రితో ముగియనుందని జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత యథావిధిగా రబీ సీజన్‌కు సంబంధించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించ బడుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేసి ఏ విధమైన అంతరాయం లేకుండా అధికారులు చూడాలని సూచించారు.

News March 31, 2025

జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ కానున్న పవన్‌కళ్యాణ్

image

సీతమ్మధార జనసేన కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. క్యాంపు రాజకీయల సంస్కృతి పార్టీలో ఉండకూడదన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమని వెల్లడించారు. త్వరలో అమరావతిలో 11 మంది జనసేన కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ భేటీ ఉంటుందని ఆయన తెలిపారు.

error: Content is protected !!