News March 26, 2025

ఎటపాక: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు

image

నాలుగేళ్ల చిన్నారిని ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఎటపాక మండలం గౌరిదేవిపేట పంచాయతీ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 17న ఊరిలో జాతర జరిగింది. ఇంట్లో వారంతా జాతరకు వెళ్లగా ఒంటరిగా ఆడుకుటున్న నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన మడకం చిట్టిబాబు(38) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఎటపాక పోలీసులో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ కన్నపరాజు తెలిపారు.

Similar News

News December 1, 2025

వనపర్తి జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

>WNP: రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఉమర్ సిద్ధిక్
>ATKR: సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం
>WNP: ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
>WNP: దేశంలోనే అత్యుత్తమ రహదారులను నిర్మిస్తాం మంత్రి
>GPT: BRSలో చేరిన మాజీ ఎంపీటీసీ
>WNP: దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలి
>PBR: నమ్మి వచ్చిన వారికి అండగా ఉంటా: నిరంజన్ రెడ్డి
>WNP: రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడికి డాక్టరేట్

News December 1, 2025

ములుగు: చల్పాక ఎన్‌కౌంటర్‌కు ఏడాది

image

ఏటూరునాగారంలోని చల్పాక అటవీ ప్రాంతంలో గత ఏడాది డిసెంబర్ 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ఘటన జరిగి నేటికీ సరిగ్గా ఏడాది. కాగా, ఎన్‌కౌంటర్‌కు కీలక నేత బద్రు, మల్లయ్య, దేవల్, జమున, కిషోర్, కామేష్‌తోపాటు మరో సభ్యుడు మృతి చెందారు. ఆ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే.

News December 1, 2025

సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో క్యాంప్ ఫైర్

image

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు సోమవారం సాయంత్రం క్యాంప్ ఫైర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 బాలికల, 10 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. రోజంతా మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన క్రీడాకారులు సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్‌లో ఆడి పాడి సేద తీరారు.