News March 29, 2024
ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు సీటు ఖరారు

ఉత్కంఠ రేపిన గంటా శ్రీనివాసరావు పోటీచేసే స్థానాన్ని ఎట్టకేలకు టీడీపీ ఖరారు చేసింది. భీమిలి నుంచి బరిలో ఉంటారని తుదిజాబితాలో వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా.. ఈసారి కూడా ఆయన పోటీచేసే స్థానం మారడం గమనార్హం. చీపురుపల్లి నుంచి ఆయన పోటీచేస్తారని ఊహాగానాలు వచ్చినా అక్కడి నుంచి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. కాగా భీమిలి వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పోటీచేస్తున్నారు.
Similar News
News September 13, 2025
భీమిలి: బాలికపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

భీమిలి ప్రాంతంలో 8 నెలల క్రితం వికలాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి పోక్సోచట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భీమిలి ప్రాంతంలో అమ్మమ్మ దగ్గర ఉన్న మైనర్‌ను బోరా ఎల్లారావు అత్యాచారం చేశాడు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.
News September 13, 2025
ఈపీడీసీఎల్ CMD పృథ్వితేజ్‌కి ఏపీ ట్రాన్స్‌కోలో అదనపు బాధ్యతలు

విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ఈపీడీసీఎల్ CMD పృథ్వితేజ్‌ని ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్&అడ్మిన్)గా పూర్తి అదనపు బాధ్యతలపై ప్రభుత్వం నియమించింది. ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ సభ్య కార్యదర్శిగా ఏపీ ట్రాన్స్‌కో (విజిలెన్స్ & సెక్యురిటీ) బాధ్యతలు కూడా అప్పగించింది. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
News September 12, 2025
విశాఖ: డిజిటల్ మోసం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

విశాఖలో ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసి రూ.1.60 కోట్లు కాజేసిన కేసులో ప్రధాన నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు యూపీలోని బరేలి ప్రాంతానికి చెందిన ఆకాష్ యాదవ్‌ను అరెస్టు చేసి రిమండ్‌కి తరలించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. జూన్ 24న బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.