News August 15, 2024

ఎట్టకేలకు మిథున్ రెడ్డికి భద్రత పెంపు

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు అల్లర్లు జరిగాయి. ఈక్రమంలో  ఆయనకు అపాయం పొంచి ఉందని నిఘావర్గాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆయనకు 8 మంది సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సదరు సిబ్బంది ఇవాళ మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

Similar News

News December 1, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కురిసిన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. సోమలలో అత్యధికంగా 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గుడిపాలలో 2.4 మి.మీ పడింది. కార్వేటినగరంలో 19. 2, పులిచెర్లలో 15.8, విజయపురంలో 15.4, రొంపిచర్లలో 14.8, సదుంలో 13, వెదురుకుప్పంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News December 1, 2025

6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.

News December 1, 2025

చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు

image

చిత్తూరు జిల్లాలో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 2023-24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024-25 నాటికి అదే శాతం ఉంది. 2025-26లో 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47,454 మందిని పరీక్షించగా.. 168 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే 22,430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.