News April 15, 2024

ఎడపల్లిలో బాలిక సూసైడ్

image

మండలానికి చెందిన ఓ బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బోధన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో వెతకగా 10 పేజీల లెటర్ లభ్యమైనట్లు వెల్లడించారు. 4 ఏళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోవడంతో మనస్తాపానికి గురైనట్లు ఆమె తల్లి పేర్కొంది.

Similar News

News January 9, 2025

NZB: అక్కడ ఆ తేదీల్లో సౌకర్యాలు కల్పించండి: మైనారిటీ కమిషన్ ఛైర్మన్

image

నిజామాబాద్ నగర సమీపంలోని సారంగపూర్ వద్ద ఈ నెల 19, 20, 21 తేదీలలో జరిగే ఇజ్తెమాకు తగు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ మున్సిపల్ కమిషనర్ దిలీప్ ను ఆదేశించారు. ఈ ఇజ్తెమాకు నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 30 వేల పైచిలుకు మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీటి వసతి, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.

News January 9, 2025

గోలిలింగాల గ్రామ కార్యదర్శిగా సంతోష్ కుమార్

image

నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామ నూతన కార్యదర్శిగా సంతోష్ కుమార్ నియమితులయ్యారు. దీంతో ఇవాళ గ్రామ పెద్దలు శాలువాతో ఘనంగా సన్మానించారు. సంతోష్ కుమార్.. గోలిలింగాల గ్రామ కార్యదర్శిగా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో బొల్లారం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గ్రామపెద్దలు పేర్కొన్నారు.

News January 9, 2025

సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? మాకు చెప్పండి: SP

image

సంక్రాంతి పండుగ సందర్బంగా ఇంటికి తాళమేసి ఊరెళ్తున్నారా ఐతే, అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు. పండుగ సందర్భంగా చాలా మంది తమ స్వస్థలాలకు వెళుతుంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. దొంగతనాల నియంత్రణకు.. తమ గ్రామాలకు వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని ఆమె సూచించారు.