News January 29, 2025

ఎడపల్లి: చిరుత సంచారం కలకలం

image

ఎడపల్లి మండలం అలీసాగర్ ప్రాజెక్ట్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. స్థానిక బెరుకు గుట్ట వద్ద చిరుత కనిపించిందని సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు పాదముద్రలు సేకరించారు. ఈ ముద్రలు చిరుతవేనా కాదా అని తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు ఆధారాలున్నాయని.. స్థానికులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారి ప్రతాప్ పేర్కొన్నారు.

Similar News

News February 13, 2025

నిజామాబాద్‌: ప్రయోగ పరీక్ష కేంద్రాలు తనిఖీ

image

పరీక్ష కేంద్రాలలో కెమెరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లను DIEO రవికుమార్ ఆదేశించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడో దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా పలు ప్రయోగ పరీక్షా కేంద్రాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

News February 13, 2025

ఆలూర్‌లో కుంటలో పడి వ్యక్తి మృతి

image

ఆలూర్ వెంకటేశ్వర గుట్ట వద్ద తవ్విన కుంటలో ముత్తేన్న అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక మద్యానికి అలవాటు పడి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం ఏడు గంటలకు కుంటలో ఆయన మృతదేహం బయటపడింది.

News February 13, 2025

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్‌కు జిల్లా వాసులు

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ఈ నెల 15 నుంచి 28 వరకు కాకినాడలో జరుగునుంది. ఈ టోర్నమెంట్‌కు జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు జాకోర ZPHSకు చెందిన PET స్వామి కుమార్, డిచ్పల్లి ZPHSకు చెందిన PET స్వప్న రాష్ట్ర జట్టుకు సారథులుగా ఎంపికైయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ , SGF కార్యదర్శి నాగమణి వారిని అభినందించారు.

error: Content is protected !!