News April 24, 2024
ఎడపల్లి చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ఎడపల్లి సాటాపూర్ గేటు సమీపంలోని ఆడి చెరువులో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు వెల్లడించారు. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. తెల్లటి చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించినట్లు పేర్కొన్నారు. అతడిని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News January 22, 2025
బాల్కొండ: రాష్ట్ర స్థాయి పోటీలకు బాల్కొండ విద్యార్థిని
బాల్కొండ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నవనీత జిల్లా స్థాయిలో SCERT & ELTA సంయుక్తంగా నిర్వహించిన ఆంగ్ల ఉపన్యాస పోటీల్లో రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో ప్రథమ బహుమతి పొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు. అలాగే తమ పాఠశాల విద్యార్థులు మండల స్థాయి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిని పలువురు అభినందించారు.
News January 22, 2025
NZB: ప్రణాళికకు అనుగుణంగా సభలు నిర్వహించాలి: కలెక్టర్
ప్రణాళికకు అనుగుణంగా ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న గ్రామ సభల నిర్వహణపై మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
News January 21, 2025
NZB: జిల్లా జడ్జిని కలిసిన రైతు కమిషన్ సభ్యులు
నిజామాబాద్ నగరంలోని జిల్లా జడ్జి సునీత కుంచాలను ఆమె కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, ఆకుల రమేష్ న్యాయవాదులు పాల్గొన్నారు.