News March 9, 2025

ఎడపల్లి: బావిలో దూకి యువకుడు ఆత్మహత్య

image

ఎడపల్లి మండలంలోని ఠాణాకలన్ గ్రామానికి చెందిన సురేశ్(24) అనే యువకుడు కుటుంబ కలహాలతో శుక్రవారం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం మృతదేహం నీటిపై తేలి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 7, 2025

NZB:16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

image

నిజామాబాద్ శివారులోని గూపన్‌పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్‌ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్‌ను కత్తిరించినట్లు గుర్తించారు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO పేర్కొన్నారు.

News December 6, 2025

స్ట్రాంగ్ రూమ్‌ను తనిఖీ చేసిన NZB కలెక్టర్

image

NZB సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లకు పంపిస్తున్న పోలింగ్ మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. సామగ్రి తరలింపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో సాయగౌడ్ పాల్గొన్నారు.

News December 6, 2025

NZB: ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడండి: MP

image

ప్రభుత్వ టీచర్లకు తప్పని సరి అనే నిబంధనల విషయంలో చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ను MP అర్వింద్ ధర్మపురి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం అందజేసిన ఎంపీ మాట్లాడుతూ NZBలోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వేల మంది ఉపాధ్యాయులపై ఈ టెట్ తప్పనిసరి అంశం ప్రభావం చూపుతోందని వివరించారు.