News January 29, 2025
ఎడపల్లి: బ్యాంకు ఉద్యోగి వెంటబడిన పులి

ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ ఎస్బీఐ బ్రాంచ్ లో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న మాసూద్ మంగళవారం రోజువారీగా విధులకు వచ్చాడు. అయితే పెండింగ్ పనులు ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు ఆలస్యమైంది. పనులు పూర్తి చేసుకొని 7 గంటల ప్రాంతంలో ఠాణాకలాన్ నుంచి బైక్‌పై వెళుతుండగా మార్గమధ్యలో సబ్స్టేషన్ ప్రాంతంలో ఓ పులి వెంటబడింది. బైక్ స్పీడ్ పెంచడంతో పులి భారీ నుంచి తప్పించుకున్నట్లు ఆయన తెలిపాడు.
Similar News
News February 13, 2025
కుంభమేళాలో చాయ్‌వాలా ఆదాయం తెలిస్తే షాక్!

కోట్లమంది రాకతో మహా కుంభమేళా వద్ద తిండి పదార్థాలు, టీలు, కాఫీలు, వాటర్ బాటిళ్లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. అక్కడ టీ, కాఫీ అమ్ముతూ ఓ చాయ్‌వాలా ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. అతడి సంపాదన నిత్యం రూ.7000. అందులో రూ.2000 ఖర్చులు పోను రూ.5000 మిగులుతున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. అంటే కుంభమేళా జరిగే నెలరోజుల్లో అతడి ఆదాయం రూ.1.50లక్షలకు పైనేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News February 13, 2025
లోక్‌సభ ముందుకు కొత్త IT బిల్లు

లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్‌సభను వాయిదా వేశారు.
News February 13, 2025
వైసీపీని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర: జూపూడి

AP: కూటమి ప్రభుత్వం చట్టాలు తెలియకుండా ప్రవర్తిస్తోందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు దుయ్యబట్టారు. వైసీపీ కేడర్‌ను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోందని అన్నారు. గన్నవరం దాడి విషయంలో 94 మందిపై కేసులు పెట్టారన్నారు. కోర్టులో కేసులు నడుస్తుంటే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సత్యవర్ధన్ నిజం చెబితే పోలీసుల చేత వేధించి కేసులు పెట్టించారని విమర్శించారు.