News November 27, 2024

ఎడపల్లి: మళ్లీ రెచ్చిపోయిన శునకాలు.. ముగ్గురికి గాయాలు

image

ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంపులో శునకాలు రెచ్చిపోతున్నాయి. పక్షం రోజుల్లోనే ఆరుగురిపై దాడికి పాల్పడి విచక్షణ రహితంగా గాయపర్చాయి. తాజాగా మంగళవారం గ్రామానికి చెందిన అబ్దుల్ సోఫి అనే యువకుని పై శునకం దాడి చేసి నోటి కింద పెదవిని కొరికివేసింది. అలాగే ఓ పసి బాలునిపై, ఓ బాలికపై దాడి చేసి గాయపర్చాయి. కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కుక్కల బెడద నుంచి జనాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Similar News

News December 7, 2024

KMR: ‘తప్పులు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి’

image

ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చివరి ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల ప్రతినిధులలో వారం సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితా సవరణలపై చర్చించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

News December 7, 2024

NZB: పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ డివిజన్ లలో క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

News December 6, 2024

కౌలాస్‌కోటను సందర్శించిన సబ్ కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కౌలాస్ కోటను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి రేపు (శనివారం) సందర్శించనున్న నేపథ్యంలో ఆమె కౌలాస్ కోటను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.