News January 5, 2025
ఎడపల్లి: యువకుడి పై కత్తులతో దాడి
ఎడపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు తన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి మిత్రులతో ముచ్చటిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్, నరేష్, కల్యాణ్, చంద్రకాంత్ అతని తమ్ముడు రవికాంత్ దుర్భషలాడుతూ.. ప్రణయ్ పై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రణయ్ మిత్రులు అక్కడి నుంచి పారిపోయారు. వారు ప్రణయ్ పై కత్తులతో దాడి చేసి గాయపర్చారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నామన్నారు.
Similar News
News January 17, 2025
రాజంపేట: చైన్ స్నాచింగ్‌కు యత్నించి.. ఖాళీ చేతులతో
బైక్‌పై వెళ్తున్న దుండగులు ఆటోలో వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాగేందుకు ప్రయత్నించగా గొలుసు తెగి ఆమె ఒడిలో పడింది. ఈ ఘటన రాజంపేట మండలం అరగొండ హైస్కూల్ వద్ద గురువారం జరిగింది. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఈ విషయమై బిక్కనూరు సీఐ సంపత్ మాట్లాడుతూ.. యూనికార్న్ బైక్‌పై ఉన్న వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే 8712686153 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
News January 17, 2025
NZB: అబద్ధాలు చెప్పి CM కాలం గడుపుతున్నారు: MLA వేముల
సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం TG భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు.. 400 రోజులైనా ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు.
News January 17, 2025
లింగంపేట: బీడు భూములకు రైతుభరోసా రాకుండా చూడాలి: RDO
రైతు భరోసా సర్వేను ఎలాంటి తప్పులు జరగకుండా నిర్వహించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో గురువారం రైతు భరోసా సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన రైతులకు రైతు భరోసా వచ్చేవిధంగా చూడాలని AEOలకు, రెవెన్యూ అధికారులను సూచించారు. బీడు భూములకు రైతు భరోసా రాకుండా చూడాలన్నారు.