News November 18, 2024
ఎడపల్లి: విద్యుత్ షాక్తో బాలుడు మృతి
గాలిపటం కోసం చెట్టు ఎక్కిన ఓ బాలుడు కరెంట్ షాక్కు గురై మృతి చెందిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది. కుర్నాపల్లి గ్రామానికి చెందిన మతిన్(13) సోమవారం ఇంటి వద్ద గాలిపటం ఎగురవేశాడు. అది చెట్టుకు చిక్కుకుపోవడంతో దాన్ని తీసేందుకు చెట్టుఎక్కాడు. ఇనుప రాడ్డు సహాయంతో కరెంట్ తీగల్లో చిక్కకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించగా కరెంట్ షాక్తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News November 18, 2024
NZB: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ – 3 పరీక్షలు
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ – 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు.
News November 18, 2024
NZB: ‘నెల రోజులకే ఉద్యోగం నుంచి తొలగించారు’
జాబ్లో చేరిన నెలలోనే ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన ధర్పల్లిలో జరిగింది. DSCలో SGTగా ఎంపికై దుబ్బాక పాఠశాలలో పనిచేస్తున్న లావణ్యను అధికారులు ఉద్యోగం నుంచి తీసేశారు. ఆమె స్థానంలో భార్గవిని నియమించారు. కాగా, భార్గవి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాలేదని, సెలక్షన్ లిస్టులో పేరు లేకపోయినా అధికారులు అవినీతికి పాల్పడి తన స్థానంలో భార్గవిని నియమించారని లావణ్య ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.
News November 18, 2024
NZB: గుండెపోటుతో డాక్టర్ మృతి
గుండెపోటుతో సీనియర్ డాక్టర్ భీంసింగ్ సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన గతంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) సూపరింటెండెంట్గా విధులు నిర్వహించారు. ఆప్తాలమిక్ వైద్యుడిగా నిజామాబాద్ నగర ప్రజలకు సేవలందించి గత మేలో పదవీ విరమణ చేశారు. ఆయన అంత్యక్రియలు నేడు మాక్లూర్ తండాలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు వైద్యులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.