News March 28, 2024

ఎడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

image

మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు, ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వైపు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి NRI ఆసుపత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 15, 2025

GNT: ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

విద్యుత్ వంటి ఇంధన వనరులను పొదుపుగా వినియోగించి భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20వ వరకు జరుగుతున్న విద్యుత్ పొదుపు వారోత్సవాల ప్రచార పోస్టర్ ను సోమవారం కలెక్టరేట్‌లో తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. విద్యుత్ పొదుపుపై వారోత్సవాల్లో విస్తృతంగా అవగాహన నిర్వహించాలని చెప్పారు.

News December 15, 2025

శబరిమలలో గుంటూరు జిల్లా యువకుడి మృతి

image

కొల్లిపర మండలం చెముడుబాడు పాలెం గ్రామానికి చెందిన చైతన్య (22) అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళ వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. కన్య స్వామిగా వెళ్లిన ఆయన 12వ తేదీన మరణించగా, అయ్యప్ప ఆలయ కమిటీ ప్రత్యేక వాహనంలో చైతన్య మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News December 15, 2025

ఈ నెల 18 నుంచి యువజనోత్సవాలు: కలెక్టర్

image

రాష్ట్ర స్థాయి యువజనోత్సవం, ఆంధ్ర యువ సంకల్ప్–2K25 కార్యక్రమాన్ని ఈ నెల 18,19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, యువజన సేవల శాఖ తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రులు లోకేశ్, రాం ప్రసాద్ రెడ్డి అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభిస్తారని అన్నారు.