News March 12, 2025

ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?

Similar News

News December 2, 2025

GHMC: దీర్ఘకాలిక సేవల కోసం HMWSSB ప్రణాళికలు

image

GHMCలో శివారు మున్సిపాలిటీల విలీనంతో HMWSSB పరిధి కూడా పెరగనుంది. దీంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ తన సేవలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనంతో తాగునీరు, సీవరేజ్, డ్రైనేజి లైన్ నిర్వహణ భారంగా మారనుంది. కొత్తగా లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, పాతవాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 2047 వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

News December 2, 2025

నాగర్‌కర్నూల్‌లో స్వల్పంగా తగ్గిన చలి

image

NGKL జిల్లాలో గత నాలుగు రోజులుగా చలి తీవ్రత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను మంగళవారం ప్రకటించారు. అత్యల్పంగా చారకొండ మండలం సిరిసనగండ్లలో 17.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పదర (17.4), అమ్రాబాద్ (17.6), కల్వకుర్తి మండలం తోటపల్లి (17.6)లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 2, 2025

నల్గొండ: రెండో దశకు నేటితో తెర..!

image

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. జిల్లాలోని 10 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు 1,703 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో రెబెల్స్‌ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, BRS నేతలు యత్నిస్తున్నారు. రెండో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టి సారించారు.