News March 12, 2025

ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?

Similar News

News December 18, 2025

మహబూబాబాద్‌లో ఎక్కువ.. ములుగులో తక్కువ!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 88.52 శాతం పోలింగ్‌తో మహబూబాబాద్ ముందు వరుసలో ఉంది. జనగామ 88.48%, వరంగల్ 88.21%, హనుమకొండ 86.45%, భూపాలపల్లిలో 84.02%, ములుగులో 83.88% పోలింగ్ నమోదు అయ్యింది. 24 మండలాల్లో జరిగిన 3వ విడతలో 6.28 లక్షల ఓటర్లుండగా, వారిలో 5.75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 18, 2025

HYD: ‘హద్దు’లు దాటిన ‘విలీనం’

image

విస్తరణలో భాగంగా GHMC 300 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై అభ్యర్థనలను నిన్నటి వరకు స్వీకరించింది. అయితే విభజించిన వార్డుల్లో తక్కువ, ఎక్కువ ఓటర్లు ఉన్నారంటూ, అసలు దేని ఆధారంగా ఈ ప్రక్రియ చేశారంటూ భగ్గుమన్నారు. స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. 3 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయని అధికారులు తెలిపారు. డివిజన్లలో హద్దుల మార్పు ఏమైనా జరుగుతుందా, యథావిధిగా ఉంటుందా వేచి చూడాలి.

News December 18, 2025

JNTUHకు నిధులు కావాలని సీఎంకు లేఖలు! కానీ..

image

JNTUHలో పరిపాలన విషయంలో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీకి తెలియకుండా ఓ డైరెక్టర్ ఏకంగా సీఎంకు యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కావాలంటూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. కనీసం వర్సిటీ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నిబంధనలు పాటించకుండా ఈ వ్యవహారం జరిగిందని వర్సిటీలో పలువురు చర్చిస్తున్నారు. దీనిపైన యూనివర్సిటీ యంత్రాంగం ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.