News January 30, 2025
ఎత్తొండ: ఆరుగురు అధికారులపై వేటు

కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలోని సహకార కేంద్ర సంఘం బ్యాంకు భారీ అవినీతి అక్రమాలకు పాల్పడటంతో ఆరుగురు అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సరైన రికార్డు నిర్వహణ లేకపోవడంతో కార్యవర్గాన్ని రద్దు చేస్తూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎత్తొండ సహకార కేంద్ర సంఘానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
Similar News
News February 18, 2025
MNCL: MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

రాష్ట్రంలో ఈ నెల 27న జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం, భరోసా, ప్రజల పక్షాన బీజేపీ చేసిన పోరాటం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ గెలుపునకు బాటలు అని పేర్కొన్నారు.
News February 18, 2025
ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటి వాయిదా పడింది.
News February 18, 2025
PHOTO OF THE DAY

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంగా దేవికి పవన్ దంపతులు హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరంతా కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ PHOTO OF DAY ఇదేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.