News June 21, 2024
ఎద్దు పై ప్రేమతో విగ్రహం ఏర్పాటు.. పూజలు, అన్న దానం

NZB జిల్లాలోని మంచిప్పకు చెందిన సోదరులు.. రాంరావు, ప్రకాష్ రావు, రమేష్, బల్వంత్ రావు లకు పశువులంటే ప్రాణం. అయితే వీరికి గతంలో నాలుగు వందలకు పైగా ఆవులు ఉండగా అందులో ఒక ఎద్దు ఉండేది. దాన్ని ఇంట్లో ఒకరిగా చూసుకుంటూ లక్ష్మి దేవిలా పూజించే వారు. 2007 APR 5న అది చనిపోయింది. దానిపై మమకారంతో పొలంలో విగ్రహం ఏర్పాటు చేసి వారానికోసారి పూజలు చేస్తున్నారు. APR 5న అన్నదానం చేస్తున్నారు.
Similar News
News February 8, 2026
NZB మేయర్ BJP గెలిస్తే ప్రధాని వస్తారు: రఘునందన్ రావు

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ మేయర్ స్థానాన్ని గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేరళ తిరువనంతపురంలో మేయర్ అభ్యర్థి గెలిస్తే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లారని గుర్తు చేశారు. అలాగే ఇక్కడికి వస్తారని హామీ ఇచ్చారు.
News February 8, 2026
NZB: ప్రచార కార్యక్రమాలపై నిషేధం

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని NZB, BDN, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు.
News February 8, 2026
NZB: బందోబస్తుతో కౌంటింగ్ హాల్‌కు తరలించాలి: కలెక్టర్

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం పరిశీలించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్ హాల్‌కు తరలించాలని ఆదేశించారు.


