News January 29, 2025

ఎనమాముల మార్కెట్‌ నూతన కమిటీ ప్రకటన

image

వరంగల్ ఎనమాముల మార్కెట్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్ ఛైర్మన్‌గా బండి జనార్దన్‌ను నియమించారు. మొత్తం 18 మందితో ఎనమాముల మార్కెట్ నూతన కమిటీని ప్రకటించారు. కమిటీలో రాజు, వాసుదేవ రెడ్డి, రుద్ర ప్రసాద్, శ్యాం, సబేరా, గోపాల్ రావు, ప్రదీప్ కుమార్, నాగరాజ్, సంపత్, భిక్షపతి, నరసింహ నాయక్ తదితరులు ఉన్నారు .

Similar News

News December 19, 2025

కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ముగింపు

image

బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. శుక్రవారం అమ్మవారు మాల ధరించిన భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారి అలంకరణ ముగ్గులు పలువురుని ఆకట్టుకున్నాయి. ఆలయంలో దీపాలంకరణ సేవను ఈవో శోభారాణి దీపాలు వెలిగించి ప్రారంభించారు.అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని ఈవో శోభారాణి తెలిపారు.

News December 19, 2025

అమరావతి పెట్టుబడులపై మలేషియా బృందంతో చర్చలు

image

రాజధాని అమరావతిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ శుక్రవారం మలేషియా బృందంతో సమావేశమయ్యారు. రాయపూడిలోని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాజధాని నిర్మాణ పురోగతిని, ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలను వివరించారు. 2026 జనవరి ప్రథమార్థంలో అమరావతిలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహణపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు.

News December 19, 2025

నల్గొండ: విషాదం.. అమ్మాయి కోసం చనిపోయాడు..!

image

తాను ప్రేమించిన యువతి దూరమవుతోందనే బాధతో ఉరేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో జరిగింది. ఏఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాలు.. వెలిమినేడు పరిధిలోని దశమి ల్యాబ్స్‌లో ఝార్ఖండ్ వాసి సుధీర్ ఓర్వాన్(22) పని చేస్తూ లేబర్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయి తనకు దూరమవుతోందని క్వార్టర్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో బ్లాంకెట్‌తో ఉరేసుకుని చనిపోయాడు. కేసు నమోదైంది.