News September 13, 2024
ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు
వరంగల్లోని ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల తెలిపారు. ఈనెల 14న శనివారం వారాంతపు యార్డు బందు, 15న ఆదివారం కాగా, 16న సోమవారం వినాయక నిమజ్జనం సందర్భంగా, 17న మంగళవారం మిలాద్ ఉన్ నబీకి సెలవు ఉందన్నారు. తిరిగి 18న మార్కెట్ పున:ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News October 10, 2024
HNK: రతన్ టాటా మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు..
నవభారత నిర్మాత, భారత పారిశ్రామిక రంగానికి మార్గదర్శి, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మరణం బాధాకరమని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచి, భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపారవేత్తగా రతన్ టాటా నిలిచారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
News October 10, 2024
హనుమకొండ జిల్లాలో విషాదం.. ఒకేరోజు తల్లి, కొడుకు మృతి
హనుమకొండ జిల్లాలో బుధవారం విషాదం నెలకొంది. వివరాలిలా.. భీమదేవరపల్లి మండలం ములుకనూరుకి చెందిన శోభ(53)కు టీబీ వ్యాధి సోకగా, కుమారుడు సాయికిరణ్(25) క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తల్లి శోభ నిన్న ఉదయం చనిపోగా, సాయికిరణ్ రెండు గంటల్లో చనిపోయాడు. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందడంతో ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News October 10, 2024
ఎంపీ విందులో పాల్గొన్న వరంగల్ ఎమ్మెల్యేలు
రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో కలిసి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రనాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజులు సైతం పాల్గొని విందు భోజనం చేశారు.కార్యక్రమంలో పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.