News March 19, 2025

ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 28, 2025

సిద్దిపేటలో ధాన్యం తడిసి ముద్ద.. అన్నదాతల ఆందోళన

image

సిద్దిపేట జిల్లాలోని నంగునూర్‌ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నేడు కూడా వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కవర్లు కప్పినా నీరు చేరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తితే నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం తేమ శాతం, నిబంధనలను సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

News October 28, 2025

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు

image

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని, ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 70,842 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 25,125 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

News October 28, 2025

జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు రికార్డు ధర!

image

వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. నిన్న వేలంలో కేజీ రూ.454 పలికి చరిత్ర సృష్టించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఐదు పోగాకు కేంద్రాల్లో వేలం జరగ్గా.. గోపాలపురంలో రూ.454 ధర పలికింది. ఇటీవల పలికిన అత్యధిక ధర రూ.430, రూ.420, రూ.415. కాగా ఈ ఏడాది మొదట్లో కేజీ రూ.290 మాత్రమే పలకడంతో రైతులు నిరాశ చెందారు. తర్వాత క్రమంగా పెరుగుతూ ఎక్కువ కాలం రూ.350 వద్ద నమోదు అవుతూ వచ్చింది.