News March 19, 2025
ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 20, 2025
అనకాపల్లి: భర్తపై వేడినీరు పోసిన భార్య

అనకాపల్లి మండలం తుంపాలలో భర్తపై భార్య వేడి నీరు పోసి గాయపరిచింది. భర్త చంద్రశేఖర్‌ను ఇల్లరికం రావాలని భార్య లోకేశ్వరి ఒత్తిడి తీసుకువస్తుంది. భర్త నిరాకరించడంతో లోకేశ్వరి వేడి నీరు పోసినట్లు సీఐ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. గాయపడిన భర్త అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
News April 20, 2025
రూ.3,900 కోట్ల భూమిని కాపాడిన బాలుడి లెటర్!

TG: హైడ్రాకు ఓ బాలుడు రాసిన లేఖ రూ.3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. లంగర్‌హౌజ్‌కు చెందిన బాలుడు జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ సెంటర్ దగ్గర్లోని ఖాళీ స్థలంలో కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల నార్నె ఎస్టేట్స్ అనే సంస్థ అక్కడ కంచె ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టడంతో అతడు హైడ్రాకు లేఖ రాశాడు. అది ప్రభుత్వ భూమి అని గుర్తించిన హైడ్రా, అక్కడి 39 ఎకరాల భూమిని తాజాగా స్వాధీనం చేసుకుంది.
News April 20, 2025
KMR: స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడి మృతి

బిక్కనూర్‌లోని పెద్దమల్లారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెగుంటకు చెందిన సందీప్ పెద్దమ్మ తల్లి ఉత్సవాల కోసం దామరచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం స్నేహితులతో కలిసి పెద్దమల్లారెడ్డిలోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడానికి వెళ్లాడు. సందీప్ పూల్‌లోకి దూకగానే తలకు గాయమై ఫిట్స్ వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.