News February 3, 2025
ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించిన రోజే సంతృప్తి: బాలయ్య

తనకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సంతృప్తి లేదని నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు, ప్రజా సంక్షేమ పాలనకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న వచ్చిన రోజే తనకు సంతృప్తి అని బాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ ఛైర్మన్ ఛాంబర్లో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News February 11, 2026
HYD: లక్షల్లో లోన్.. క్లిక్ చేస్తే క్లీన్!

HYDలో లక్షల్లో లోన్ ఇస్తాం సార్ అంటూ.. మాయ మాటలు చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రూ.3 లక్షల లోన్ ఇస్తామని మెసేజ్‌లు పంపుతున్నారు. పొరపాటున లింక్ క్లిక్ చేశారో.. మీ పని అంతే! అకౌంట్ ఖాళీ చేసేస్తున్నారు. ఏడాది కాలంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. HYD పరిధిలో 2, సైబరాబాద్- 216, రాచకొండ-125 లోన్‌లకు సంబంధించిన కేసులు సైబర్ క్రైమ్ PSలో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News February 11, 2026
గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.