News July 14, 2024
ఎన్టీఆర్: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఈనెల 5వ తేదీన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సోదరుడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. బాపట్ల జిల్లాకు చెందిన కంపిరి సురేశ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అతనికి ఇద్దరు కూమారులు. వారిలో పెద్దవాడు గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేందటే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించి తమ్ముడే హత్య చేశాడని SI తెలిపారు.
Similar News
News October 6, 2024
ప్రజలపై టికెట్ రేట్ల భారం మోపము: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల
ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ళ నారాయణరావు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేదవారికి, మధ్య తరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతామన్నారు.
News October 6, 2024
విజయవాడ: దుర్గమ్మ రేపు ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?
శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు ఆదివారం నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ లలితా దేవి తనను కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుందని పండితులు తెలిపారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించిన అమ్మవారు భక్తుల ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందన్నారు.
News October 6, 2024
తిరుమలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే సుజనా
వైసీపీ పదేపదే తిరుమలపై దుష్ప్రచారం చేస్తోందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా శనివారం ట్వీట్ చేశారు. ‘ఎందుకు తిరుమల అంటే మీకు అంత కోపం, హిందువుల మనోభావాలంటే అంత చులకన’ అంటూ వైసీపీని సుజనా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. డిక్లరేషన్ మీద సంతకం చెయ్యమంటే చెయ్యరు.. కానీ తిరుమల మీద దుష్ప్రచారం చేస్తారని సుజనా ఈ మేరకు జగన్‌ను ఉద్దేశించి Xలో పోస్ట్ చేశారు.