News January 31, 2025

ఎన్టీఆర్: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 11, 13, 15, 18వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

Similar News

News February 11, 2025

MBNR: జీరో(0) బిల్లు.. ఉమ్మడి జిల్లాలో ఎంతమందంటే!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పటివరకు మహబూబ్ నగర్-1,29,451, నాగర్ కర్నూల్-1,06,525, నారాయణపేట-77,092, గద్వాల్-84,114, వనపర్తి-80,418 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరూ నెలకు 200 యూనిట్లలోపు(జీరో బిల్) విద్యుత్ వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు.

News February 11, 2025

కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

image

TG: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనూ ఉపఎన్నిక వస్తుందని కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

News February 11, 2025

HYD: కన్నీటి ఘటన.. మృతులు వీరే..!

image

ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.

error: Content is protected !!