News March 18, 2025

ఎన్టీఆర్: ఆటల పోటీల్లో పాల్గొనే MLAలు వీరే

image

మంగళవారం సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగనున్న MLA, MLCల ఆటల పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా నుంచి పలువురు పేర్లు నమోదు చేసుకున్నారు. పురుషుల 100 మీ. పరుగుపందెం పోటీలకు మైలవరం ఎమ్మెల్యే వసంత తన పేరు నమోదు చేసుకోగా, క్రికెట్ మ్యాచ్‌కు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం వెలువడింది.

Similar News

News April 20, 2025

కొత్తగూడెం: ఇళ్ల తప్పుడు లెక్కలు.. ఉద్యోగి సస్పెండ్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్తగూడెం జిల్లాలో అవకతవకలు వెలుగుచూశాయి. భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో 18 మంది లబ్ధిదారులకు సంబంధించి, విధుల్లో ఉన్న వ్యక్తి బేస్‌మెంట్ స్థాయి నిర్మాణం పూర్తికానప్పటికీ, తప్పుడు వివరాలు నమోదు చేశారని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతణ్ని విధుల నుంచి తొలగించారు. అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని కలెక్టర్ స్పష్టంచేశారు.

News April 20, 2025

విభేదాలు పరిష్కరించుకుంటే మంచిదే: దేవేంద్ర ఫడణవీస్

image

రాజ్ ఠాక్రేతో కలిసి పని చేసేందుకు సిద్ధమేనన్నఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై MH సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ‘ఇద్దరు కలిస్తే సంతోషమే, విభేదాలను పరిష్కరించుకోవడం మంచి విషయం’ అని సీఎం అన్నారు. కాగా MNSతో పొత్తులపై చర్చలు జరగలేదని శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఇద్దరూ సోదరులని రాజకీయంగా విభేదాలున్నప్పటికీ అన్నదమ్ముల బంధం తెగిపోదని అన్నారు.

News April 20, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెండ్

image

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ CP సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తరిగొప్పుల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలాజీ, కానిస్టేబుల్ రాజు ఓ కేసు విషయంలో నిందితుడికి సహకారం అందించేందుకు ప్రయత్నించారు. నిందితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువవడంతో వారిని సస్పెండ్ చేశారు.

error: Content is protected !!