News February 10, 2025
ఎన్టీఆర్: ‘ఇంటికి రమ్మని చెప్పి.. అఘాయిత్యం’

కంచికచర్లలో విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీటెక్ చదువుతున్న విద్యార్థిని హుస్సేన్, ప్రేమించుకున్నారు. హుస్సేను ఆమెను ఇంటికి రమ్మని పిలిచి తన స్నేహితులను రప్పించి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారు. అరుపులు వినపడకుండా టీవీ సౌండ్ పెట్టారు. ఎవరికైనా చెప్తే వీడియోలు బయటపెడతామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.
Similar News
News March 6, 2026
NRPT: ‘మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలి’

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని OMIF ఆధ్వర్యంలో నారాయణపేట శిల ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని 10 కేంద్రాలలో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు, బ్యూటీ పార్లర్ కిట్లు సర్టిఫికెట్లు అందించారు. మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే విద్యా ముఖ్యమని చెప్పారు.
News March 6, 2026
ANUలో పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో అక్టోబర్/ నవంబర్ నెలలో జరిగిన పలు కోర్సుల పరీక్షల ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. బి.ఏ/బి.బి.ఏ, యల్.యల్.బి, యమ్.బి.ఏ, తదితర పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్, ఇతర పూర్తి వివరాల కోసం వెబ్సైట్‌ను www.nagarjunanuniversity.ac.in సంప్రదించాలన్నారు.
News March 6, 2026
మరోసారి బొత్సకు అస్వస్థత

AP: శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా ఇటీవల బొత్సకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లో <<19252802>>చికిత్స<<>> తీసుకున్న విషయం తెలిసిందే.


