News March 9, 2025
ఎన్టీఆర్: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాలలో డైరెక్టర్లు, మేనేజర్లు, ఎక్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్సైట్లో ఈనెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 24, 2025
ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతిల్లు కట్టుకోవాలనుకున్న పేదలకు పెరిగిన ఇసుక, ఇటుక ధరలు గుదిబండగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రూ.8 వేల నుంచి రూ.12 వేలు, ఇటుక రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తుండటంతో నిర్మాణం భారమైంది. ‘దేవుడు కరుణించినా, వ్యాపారులు కరుణించలేదు’అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 24, 2025
మండపేటలో మంత్రి పర్యటన రద్దు

మంత్రి నాదెండ్ల మనోహర్ మండపేట పర్యటన రద్దయిందని ఏపీ ఐఐసీ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ తెలిపారు. మంత్రి మంగళవారం మండపేటలో సూర్య కన్వెన్షన్ హాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల కార్యక్రమం రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు ఉంటుందో త్వరలో చెప్తామన్నారు.
News November 24, 2025
రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.


