News January 31, 2025
ఎన్టీఆర్: ఎం ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్- 2024లో నిర్వహించిన ఎం.ఫార్మసీ 1వ, 3వ ఏడాది 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
Similar News
News February 12, 2025
సంగారెడ్డి: ఈ నెల 17 నుంచి 10వ తరగతి పేపర్-2 పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 24 వరకు ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు.
News February 12, 2025
పడిపోయిన ఎలాన్ మస్క్ ఆస్తి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తి 400 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. టెస్లా షేర్ల విలువ 27శాతం పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. సంస్థ కార్ల అమ్మకాలు భారీగా తగ్గడం దాని షేర్ల విలువపై ప్రభావం చూపించింది. గడచిన వారంలో 11శాతం మేర షేర్ల విలువ పడిపోవడం గమనార్హం. డోజ్ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వ పెట్టుబడుల్ని ఆయన తగ్గించడం టెస్లా ఇన్వెస్టర్లకు నచ్చడం లేదని బిజినెస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News February 12, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పురుగుమందు తాగి యువకుడి సూసైడ్ ✓ చిలకలగట్టు జాతరకు సర్వం సిద్ధం ✓ అర్చకుడిపై దాడిని ఖండించిన VHP ✓ హామీల అమలుకు ఈనెల 20న చలో హైదరాబాద్ లిస్టు ✓ మణుగూరు అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి ✓ పోలింగ్ విధుల్లో నిబంధనలు పాటించాలి: అదనపు కలెక్టర్ ✓ చిరుమళ్ల జాతర ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఎస్పీ ✓ ఏజెన్సీ చట్టాల జోలికి వస్తే సహించేది లేదు: ఆదివాసీ నాయకులు.