News January 26, 2025
ఎన్టీఆర్: కలెక్టరేట్లో రిపబ్లిక్ డే వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాక జెండాలు, బెలూన్లు, తోరణాలతో ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మిశ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
Similar News
News October 25, 2025
పల్లీలే కదా అని తేలిగ్గా తీసిపారేయొద్దు!

ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌ను మించిన ప్రయోజనాలు పల్లీల్లో ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ కాలం జీవించేందుకు కావాల్సిన 20 అమైనో ఆమ్లాలు వీటిలో ఉన్నాయని తెలిపారు. ‘పల్లీల్లోని ప్రొటీన్ బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్, బీపీలను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డయాబెటిస్, క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది’ అని చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ తినే పల్లీలను తేలిగ్గా తీసిపారేయొద్దు.
News October 25, 2025
కృష్ణా: తుపాన్ హెచ్చరికలు.. 3 రోజులు స్కూల్స్ బంద్

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులందరినీ 26వ తేదీ సాయంత్రం లోపు వారి వారి ఇళ్లకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 25, 2025
రేపు అచ్చంపేటకు రాష్ట్ర గవర్నర్ రాక

నల్లమల అడవుల్లో పేదరికం కారణంగా వివాహాలు చేసుకోలేని 111 మంది చెంచు జంటలకు వనవాసి కళ్యాణ పరిషత్ సామూహిక వివాహాలు నిర్వహించనుంది. ఐతోలు ఆలయ అర్చకులు వెల్దండ హరికృష్ణ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. పేద చెంచులను ఆదుకోవడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.


