News January 26, 2025
ఎన్టీఆర్: కలెక్టరేట్‌లో రిపబ్లిక్ డే వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాక జెండాలు, బెలూన్లు, తోరణాలతో ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మిశ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
Similar News
News February 13, 2025
మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు: అచ్చెన్నాయుడు

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వల్లభనేని వంశీ బెదిరించడంతోనే ఇలా జరిగిందన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిదాడి చేయాలంటే 8 నెలల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
News February 13, 2025
కృష్ణా: రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ నంబర్

జిల్లాలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న 23 గ్రామాలలో రైతులు సందేహాల నివృత్తి కోసం జిల్లా సర్వే కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు 9492271542 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
News February 13, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. జిల్లాలో 144 సెక్షన్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వైసీపీ కీలక నేతల్ని హౌస్ అరెస్ట్ చేయటంతోపాటు జిల్లా అంతటా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ – 30ని అమలులోకి తీసుకువచ్చారు. జిల్లాలో ఎటువంటి నిరసనలు, ఆందోళనలకు తావులేకుండా నిషేదాజ్ఞలు జారీ చేశారు.