News August 17, 2024
ఎన్టీఆర్: కోర్టుకు హాజరైన మాజీ మంత్రి దేవినేని ఉమ
2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసు విచారణ నిమిత్తం మహారాష్ట్రలోని బిలోలి కోర్టులో శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమ హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో అప్పటి సీఎం చంద్రబాబు సహా 16 మందికి న్యాయస్థానం నోటీసులిచ్చిందని ఉమ తెలిపారు. నేడు జరిగిన విచారణకు తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, హనుమంత్ షిండేలతో కోర్టు విచారణకు హాజరయ్యామని ఉమ స్పష్టం చేశారు.
Similar News
News September 17, 2024
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల అభ్యర్థులపై TDP కసరత్తు
కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై అధికార TDP కసరత్తు చేస్తోంది. దేవినేని ఉమా, ఆలపాటి రాజా, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కోవెలమూడి రవీంద్ర(నాని), కిలారు నాగ శ్రావణ్, ఎంఎస్ బేగ్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన, యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూత్ కోటాలో నాగశ్రావణ్ పేరు బలంగా వినిపిస్తోంది.
News September 17, 2024
ఎన్టీఆర్: వినాయక లడ్డు దక్కించుకున్న ముస్లిం దంపతులు
కంచికచర్ల మండలం గొట్టుముక్కలలోని వేణుగోపాల స్వామి ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డును సోమవారం రాత్రి వేలం వేశారు. అయితే వేలంపాటలో గ్రామానికి చెందిన షేక్ మొగలా సాహెబ్, మమ్మద్ దంపతులు వేలంలో పాల్గొని లడ్డూను రూ.27,116లకు దక్కించుకున్నారు. దీంతో విఘ్నేశ్వరుడు మతాలకు అతీతుడైన దేవుడని వీరు నిరూపించగా.. పలువురు వీరిని అభినందించారు.