News February 4, 2025
ఎన్టీఆర్: క్రైమ్ పోలీసులకు రివార్డ్స్

NTR జిల్లాలో దొంగతనాల కేసులు తక్కువ సమయంలో చేదించిన పోలీసులకు నగదు రివార్డులతో ఎస్పీ రాజశేఖర్ బాబు అభినందించారు. సోమవారం విజయవాడలో విధి నిర్వహణలో విశేష ప్రతిభను కనబరిచిన పది మంది క్రైమ్ పోలీస్ అధికారులకు సిబ్బందికి నగదు వార్డులను అందించారు. నగదు రీవార్డ్ సాధించిన వారిలో స్వామి, సత్యనారాయణ,కృష్ణమూర్తి, ప్రకాష్ రావు, నాగరాజు, రవికుమార్, సురేష్, రమణ, షేక్ షబ్బీర్, శిరీష ఉన్నారు.
Similar News
News October 17, 2025
నేడు పీడీఎస్యూ రాష్ట్ర మహాసభ సన్నాహక సమావేశం

వరంగల్లో డిసెంబర్ 10 – 12న జరిగే పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేశ్ తెలిపారు. రాష్ట్ర మహాసభకు సంబంధించి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమావేశానికి పలు సంఘాల నేతలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
News October 17, 2025
ప్రిన్సిపల్ చనిపోయారంటూ ఫేక్ లెటర్.. చివరికి

పరీక్షల వాయిదా కోసం ఇద్దరు విద్యార్థులు బరితెగించారు. MP ఇండోర్ ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో BCA చదువుతున్న వారు కళాశాల లెటర్ హెడ్ సంపాదించారు. ప్రిన్సిపల్ అనామిక హఠాత్తుగా చనిపోయారని, ఈనెల 15,16న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాసి SMలో వైరల్ చేశారు. అసలు విషయం బయటపడటంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కాలేజీ 60రోజులు సస్పెండ్ చేసింది. ఇద్దరికీ మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.
News October 17, 2025
గోషామహల్: కబ్జాలను తొలగించిన హైడ్రా

ఆసిఫ్నగర్ మండల పరిధిలోని కుల్సుంపూర్ విలేజ్లోని సర్వే నం.50లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అశోక్సింగ్ అనే వ్యక్తి ఆక్రమణలో ఉన్న మొత్తం 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. అందులో షెడ్డులు వేసి విగ్రహతయారీదారులకు అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది.