News September 4, 2024

ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

image

పశ్చిమ మధ్య బంగాళఖాతంలో రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని వివరించింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రతీరం వెంబడి 35-45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.

Similar News

News September 13, 2024

కృష్ణా: బ్లాక్ స్పాట్స్ గుర్తించడంతో రోడ్డు ప్రమాదాల నివారణ

image

జిల్లాలో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు.

News September 13, 2024

గంపలగూడెం: ఒకే ఇంట్లో 100 వరకు పాములు

image

గంపలగూడెం మండల కేంద్రంలోని పడమట దళితవాడకు చెందిన రజిని ఇంటి ఆవరణలో 100 వరకు పాములు కలకలం రేపాయి. ప్రహారికి పడ్డ కన్నంలో పాములు కనిపించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒకే చోట చేరి గుట్టగా తయారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. వాటిని గమనించిన ఆ ఇంటి యజమానులు, చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వాటిని బయటకు తీసేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు.

News September 13, 2024

విజయవాడలో బాడీ మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి

image

విజయవాడలో బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. మాచవరం సీఐ ప్రకాశ్ తెలిపిన వివరాల మేరకు.. మొగల్రాజపురంలో బాడీ స్పా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశామన్నారు. అలాగే ఇద్దరు యువతులను రక్షించామని తెలిపారు. బాడీ స్పా నిర్వహిస్తున్న చైతన్య, నాగరాజును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇద్దరు మహిళలను సంరక్షణా కేంద్రానికి పంపించామన్నారు.