News March 12, 2025
ఎన్టీఆర్ జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు జి. జయ లక్ష్మి (IAS) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
Similar News
News February 13, 2026
కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కోసం లోకేశ్ ఆత్మీయ విందు

మంత్రి లోకేశ్ కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కుటుంబాల కోసం నిర్వహించిన ఆత్మీయ విందు రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిందని మంత్రి కొల్లు కొనియాడారు. నిరంతరం ప్రజాసేవలో తలమునకలయ్యే నాయకుల కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం లోకేశ్‌కే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విందు కార్యక్రమం కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచిందని, ఇలాంటి నాయకత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News February 13, 2026
తిరుపతి: మొన్న రిమూవ్.. నిన్న రిలీవ్!

TTD ఎస్వీ వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్ వ్యవహారం మలుపులు తిరిగింది. రిజిస్ట్రార్ భాస్కరుడును ఈనెల 4న రిమూవ్ చేసినట్లు VC ఉత్తర్వులు ఇచ్చారు. వారం రోజులు అదే సీటులో ఉండగా 11న పదవి కాలం ముగియడంతో రిలీజ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక రిమూవ్ చేసిన రోజు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఒక్కరికి ఇవ్వగా.. రిలీవ్ రోజు మరొకరికి ఇన్‌ఛార్జ్ ఇచ్చారు.
News February 13, 2026
ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.


