News July 6, 2024

ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన గోదావరి జలాలు

image

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద కృష్ణా నదిని తాకడానికి ప్రవహిస్తున్న నీరు, జక్కంపూడి సమీపంలో కొండల మధ్య ఇలా ప్రవహిస్తున్నాయి. కాగా పట్టిసీమ ఎత్తిపోతల వద్ద 16 పంపుల ద్వారా 5,664 క్యూసెక్కుల నీరు పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 22, 2025

కృష్ణా: కార్యాలయ పరిసరాలు శుభ్రం చేసిన కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్‌తో పాటు డీపీఓ అరుణ, డీఆర్ఓ చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాలను తొలగించారు. వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

News November 22, 2025

ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

image

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్‌లెవల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్‌ కలెక్టర్‌, ముడా ఇంఛార్జి వైస్‌ ఛైర్మన్‌, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నవీన్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్‌ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్‌వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.